వీరనారాయణపురం ఆంజనేయస్వామి దేవాలయ  అర్చకుడు సంతోష్ మృతి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన టిఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్

వీరనారాయణపురం ఆంజనేయస్వామి దేవాలయ  అర్చకుడు సంతోష్ మృతి

ఎల్కతుర్తి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం (దగ్గువారిపల్లి)లో ఆంజనేయస్వామి దేవాలయ అర్చకుడిగా సేవలందిస్తున్న సిద్ధాంతి సంతోష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడిన ఆయనను కుటుంబ సభ్యులు అనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. సంతోష్ మృతి గ్రామంలో విషాదాన్ని నెలకొలిపింది.

ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఆర్ఎస్ హనుమకొండ–కరీంనగర్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ దగ్గువారిపల్లికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, పరిస్థితులను తెలుసుకుని అవసరమైన సందర్భాల్లో అండగా ఉంటామని తెలిపారు.

పరామర్శ కార్యక్రమంలో సిద్ధాంతి గణేష్, హింగే రవీందర్, కందుకూరి రాజన్న, రామోజు సతీష్ చారి, కందుకూరి మహేష్ చారి, నార్లగిరి మహేందర్, చిర్ర ఉదయచందర్,పులింటి కుమార్, సింగరబోయిన రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.IMG-20251124-WA0066

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .