రోడ్డుకిరువైపుల వాహనాలు నిలుపరాదు
నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైనచర్యలు
Views: 30
On
యస్. ఐ వీరేందర్
ఖమ్మం బ్యూరో,అక్టోబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;
ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారికి ఇరువైపుల భారీ వాహనాలను నిలుపడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నందున రోడ్ పైన, రహదారికి పక్కన అకారణంగా వాహనాలను నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, చలాన్లు విధిస్తామని చింతకాని యస్. ఐ వీరేందర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. మంగళవారం పందిళ్ళపల్లి గ్రామ శివారు పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపివుంచిన పలు లారీలకు చలాన్లు విధించామని వాహనదారులు ఈ విషయాన్ని గమనించి అకారణంగా వాహనాలను పార్క్ చేయవద్దని ఆయన అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments