వైస్ ప్రిన్సిపల్ వేధింపులు…

రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వైస్ ప్రిన్సిపల్ వేధింపులు…

వికారాబాద్,తెలంగాణ  ముచ్చట్లు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.

5వ తరగతి చదువుతున్న తబిత అనే విద్యార్థిని పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి దూకింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది, విద్యార్థులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

వైస్ ప్రిన్సిపల్ వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ

తబిత తరచుగా మనస్తాపానికి గురవుతోందని, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వేధింపులే ఈ ఘటనకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలో కొంతకాలంగా భయభ్రాంతులకు గురవుతోందని, ఇంటికి వచ్చినప్పుడల్లా తనకు భయం వేస్తుందని చెప్పేదని తల్లిదండ్రులు తెలిపారు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినిని చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో విచారించనున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా వైస్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .