ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన తోకల విజయ కుమార్

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన తోకల విజయ కుమార్

రఘునాథపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం, కుర్చపల్లి గ్రామానికి చెందిన తోకల విజయ కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. “పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగంపై రిస్క్ మరియు రివార్డ్స్ – కస్టమర్ల ప్రభావం” అనే అంశంపై డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ పర్యవేక్షణలో పరిశోధన చేసి, ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ డిగ్రీ అందుకున్నారు.

విజయ కుమార్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎం.కామ్ పూర్తి చేసి నెట్, జేఆర్ఎఫ్, సెట్ అర్హతలను సాధించారు. అదనంగా, అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ డిగ్రీను పూర్తిచేసి సెట్ అర్హత పొందారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆధ్యాపకునిగా పనిచేస్తున్నారు.విజయ కుమార్ డాక్టరేట్ పొందిన సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .