దార్శనీకుడు రతన్ టాటా 

దార్శనీకుడు రతన్ టాటా 

WhatsApp Image 2024-10-19 at 4.50.41 PM (3)ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు: 

రతన్ నావెల్ టాటా దేశం  గర్వించదగ్గ ఒక జాతి రత్నం అని నాగులవంచ  శ్రీ ఆదర్శ హై స్కూల్ కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ పేర్కొన్నారు.  పాఠశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటా జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..    రతన్ టాటా ఒక గొప్ప వ్యాపారవేత్త, మానవతావాది, కర్మయోగి అని ఆయన పేర్కొన్నారు.  సమయపాలన,  విలువ తెలిసిన వ్యక్తి ఆయన నిజమైన భారత రత్నం అన్నారు.  నిజాయితీకి , ఈ దేశ కీర్తి ప్రతిష్టలను వ్యాపార దక్షతను ప్రపంచానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.  విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన సూచించారు.  ఆయన మృతి పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించారు.  రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .