మృతుల కుటుంబాలను పరామర్శ

నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహ్మద్ జావేద్

మృతుల కుటుంబాలను పరామర్శ

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

రాఘునాధపాలెం మండలంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహ్మద్ జావేద్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో చిమ్మపూడి గ్రామ అధ్యక్షులు జోనబోయిన పాపయ్య కుమారుడు జోనబోయిన వెంకటేష్ ప్రేమ విఫలం చెంది ఆత్యహత్య చేసుకోవడంతో మృతిని నివాసానికి చేరుకొని  వారి కుటుంబాన్ని ఓదార్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెంకటేష్ మృతి తీవ్ర దిగ్రాంతికి గురి చేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేటి యువత ఓటమికి కుంగిగిపోవద్ధని గుండె ధైర్యంతో ముందుకు పోవాలని సూచించారు.తల్లి దండ్రులకు మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తూ ఉంటారని వారి కడుపుకోతకు కారణం కాకూడదని తెలియజేశారు. వెంకటేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని వెంకటేష్ మృతి గ్రామంలో పార్టీకి తీరని లోటని తెలిపారు.అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా కోటపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న భూపతిరావ్  కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. పార్టీ తరపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .