జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఏఐపీసీ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన
వనపర్తి,నవంబర్08(తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఏఐపిసి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం కేబీఆర్ మసీదు సమీపంలో ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి నాయకత్వంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని, ప్రజలు చురుకుగా ఎన్నికల్లో పాల్గొని ప్రగతిశీల పాలన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అజీజ్ ఇర్ఫాన్ జీ, లతీఫ్ జీ, సందీప్ భూషణ్ జీ, శశాంక్, అబ్దుల్లా బుఖారన్ తదితర ఏఐపీసీ నాయకులు పాల్గొని ప్రజల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ప్రచారంలో భాగంగా ప్రజల్లో ఐక్యత, ప్రొఫెషనలిజం, మరియు ప్రజాకేంద్రీకృత రాజకీయాల సందేశాన్ని విస్తరించడమే తమ లక్ష్యమని ఏఐపీసీ నాయకులు పేర్కొన్నారు.


Comments