సంక్రాంతి వరకు కాలువల్లో నీళ్లు చూడాలి

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సంక్రాంతి వరకు కాలువల్లో నీళ్లు చూడాలి

జనగామ,తెలంగాణ ముచ్చట్లు:
 
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పంట పొలాలకు అవసరమైన నీటిని అందించేందుకు సంక్రాంతి వరకు కాలువల్లో నీటిని ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జనగామ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రబీ సీజన్‌లో పంటలకు నీటిని అందించేందుకు చేపట్టిన పనుల పురోగతిని తనిఖీ చేశారు.
 
అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే 
 
నీటి పారుదల శాఖ రీ-ఆర్గనైజేషన్ లోపభూయిష్టంగా ఉందని, ఇది అధికారుల పనితీరుపై ప్రతిఫలించుతోందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. అధికారులు తమ పరిధిలోని వివరాలపై స్పష్టత లేకుండా ఉన్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
 
ముఖ్య సూచనలు:
• జనవరి 8 నాటికి కాలువల మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని, పంట పొలాలకు నీరు అందించేందుకు కార్యాచరణ వేగవంతం చేయాలని సూచించారు.
• మెయిన్ కెనాల్స్ మరియు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రిజర్వాయర్ల కింద ఉన్న అన్ని చెరువులను నింపే విధంగా నీటి నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.
• రిజర్వాయర్లలో పేరుకుపోయిన సిల్ట్, చెత్తను తొలగించి నీటిని సమర్థంగా నిల్వచేయాలని పేర్కొన్నారు.
• అశ్వరావుపల్లి రైట్ మెయిన్ కెనాల్, ధర్మసాగర్, నవాబుపేట, ఉప్పుగల్లు తదితర ప్రాంతాల్లో మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని సూచించారు.
 
WhatsApp Image 2024-12-23 at 9.24.35 PM (1)ఈ సమావేశంలో పంట కాలువల నిర్వహణ, రబీ సీజన్‌కు సంబంధించి చేపట్టాల్సిన ముఖ్య కార్యక్రమాలపై దిశానిర్దేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, సీఈలు, డీఈలు, ఈఈలు, ఏఈలు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .