భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తాం
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టర్, కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఖమ్మం-దేవరపల్లి నేషనల్ హైవే దంసలాపురం భూ నిర్వాసితులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఖమ్మం-దేవరపల్లి నేషనల్ హైవే ప్రాజెక్టు, నగరాన్ని క్రాస్ చేసి దంసలాపురం మీదుగా వెళుతుందన్నారు. ఇందుకై దంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను నేషనల్ హైవే ప్రతిపాదించి, 1.38 ఎకరాల భూసేకరణకు చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. ఇందులో 14 మంది భూములు ఉన్నట్లు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నట్లు ఆయన అన్నారు. గతంలోను భూమి కోల్పోయిన వారికి మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి, సాధ్యమైనంత వరకు అన్ని విధాల భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments