ఇచ్చిన హామీలన్నింటిని కచ్చితంగా అమలు చేస్తాం
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం ప్రత్యేక చోరువా.
రానున్న రోజులలో మరో మూడు పథకాలను అమలు చేస్తాం.
జనవరి నుండి సన్న బియ్యం పంపిణీ.
కోట్లాది రూపాయలతో రోడ్లు భవన నిర్మాణ పనులు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు,తెలంగాణ ముచ్చట్లు:
ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేసి తీరుతామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామ శివారులోని జాతీయ రహదారి నుండి సిఆర్పిఎఫ్ బెటాలియన్ వరకు 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, 50 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్లు, ఇంచర్ల గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్,
జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇచ్చిన హామీలలో కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, రానున్న రోజులలో రైతు బంధు, రైతు భరోసా, మహిళలకు 2500 రూపాయల పింఛన్ పెంపు పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం కొందరికి నచ్చడం లేదని, పేద మహిళలు ఆర్థికంగా నష్టపోకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ జనవరి మాసం నుండి సన్న బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సన్న వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ సైతం ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ పథకంలో పంపిణీ చేశామని, రానున్న రోజులలో
మరో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించి రుణమాఫీ కానీ రైతులకు అందిస్తామని అన్నారు. మహిళా సంఘాల వారు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల వ్యాపారులు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇటీవల కాలంలో 150 బస్సులను మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిందని వివరించారు. గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగులకు 53 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, రానున్న రోజులలో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. రైతు భరోసా పథకంలో కూలి పనులు చేస్తున్న కూలీలకు సంవత్సరానికి 12 వేలు అందిస్తామని, ప్రతి ఇంట్లో మహిళలు బాగుంటేనే ఇల్లు, గ్రామము, దేశము బాగుంటుందని అన్నారు. రానున్న రోజులలో ఇంచర్ల గ్రామంలో ఐదు కోట్ల రూపాయలతో జిల్లా సమాఖ్య భవనాన్ని నిర్మిస్తామని, జిల్లా పర్యాటక ప్రాంతంగా పురోగతి చెందుతున్నదని దానికి అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. భవన, రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత తొ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హాజరైన అధికారులతో గ్రామ ప్రజలతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ఉపాధి హామీ పథకం లో భాగంగా వంద రోజులు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శుభ్రంగా ఉంచిన గ్రామపంచాయతీ సిబ్బందిని మంత్రి సత్కరించారు.
అనంతరం ఇంచర్ల గ్రామంలో ఎన్ హెచ్ రోడ్డు నుండి సిఆర్పిఎఫ్ బెటాలియన్ వరకు 35 లక్షల నిధులతో నూతన సి.సి. రోడ్డు నిర్మాణము, 50 లక్షల నిధులతో అంతర్గత సి.సి. రోడ్డు,
ఇంచర్ల గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయితీ భవనం నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, డిప్యూటి కామాండెంట్ ఎన్ పి రజిత, అసిస్టెంట్ కామాండెంట్ చామి నారాయణ, సుబేదార్ మేజర్ మని బాబు, ఎం పి డి ఓ రామకృష్ణ, ఎం పి ఓ రహీం, ప్రజా ప్రతినిధులు,
మహిళ సంఘ సభ్యులు, ఉపాధి హామీ లబ్ధిదారులు, గ్రామపం
చాయితీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు


Comments