అభివృద్ధిని  అడ్డుకుంటే   న్యాయ పరమైన చర్యలు చేపడతాం 

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

అభివృద్ధిని  అడ్డుకుంటే   న్యాయ పరమైన చర్యలు చేపడతాం 

రామంతపూర్, తెలంగాణ ముచ్చట్లు:

రామంతపూర్ భగయత్  వెంకట సాయి నగర్ కాలనీ బీరప్ప దేవాలయం వెనకాల లైన్ లో సాంక్షన్ అయినటు వంటి బాక్స్ కల్వర్ట్ ను అధికారులను తప్పుదోవ పట్టించి సాంక్షన్ అయినటు వంటి బాక్స్ కల్వర్టు ను వెయ్యకుండా అడ్డుకుంటున్నా రని  వెంకట సాయి నగర్ కాలనీవాసులు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కలిసారు . 

ఈ మేరకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎవరు అభివృద్ధిని  అడ్డుకుంటే  వారిపైనా న్యాయ పరమైన చర్యలు చేపడతామని అన్నారు . ఇప్పటికే రామంతపూర్ భగయత్ కాలనీలకు కోటి రూపాయలు మంజూరు చేయించి డ్రైనేజీ లైన్లు పూర్తి చేయించామని శాంక్షన్ అయినటువంటి బాక్స్ కల్వర్టు కూడా త్వరలో శంకుస్థాపన చేసి పనులను పూర్తి చేయిస్తాను అని హామీ ఇచ్చారు . 

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు గంధం నాగేశ్వరరావు , సర్వ సత్తయ్య యాదవ్, గోపాల్,ఆర్ .గోవింద్, ఏ విజయేందర్ రెడ్డి, శంకర్, శ్రీనివాస్ గౌడ్, అశోక్, నవీన్, కీర్తి ,చారి, సయ్యద్, చారి , తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .