మన దేశ ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమల ప్రాధాన్యం ఎంత..?

ఏ మేరకు ప్రత్యేక  ప్రోత్సాహకాలు ఇస్తున్నారు..?

మన దేశ ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమల ప్రాధాన్యం ఎంత..?

* పార్లమెంట్ లో  ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

భారత దేశం నుంచి జరిగే ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగం ప్రాధాన్య శాతం ఏ విధంగా ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారని  ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా.. మంగళవారం ఆయన ఈ మేరకు ప్రశ్న సంధించారు. దీనికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖల సహాయ మంత్రి  జితిన్ ప్రసాద లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సూక్ష్మ, చిన్న, మరియు మధ్యతరహా పరిశ్రమ
(ఎంఎస్ఎంఈ)ల ఉత్పత్తి ఆధారంగా 2021-22లో 45.03 శాతం కాగా..2023-24 నాటికి 45.73 శాతంగా ఉన్నట్లు తెలిపారు. 
ఈ రంగంలో ఉత్పత్తులు, సేవల మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడం కోసం 1996లో అంతర్జాతీయ సహకార పథకం ప్రారంభించబడిందని, విదేశాల్లో వాణిజ్య ప్రదర్శనలు/కొనుగోలుదారుల సమావేశాలు వర్క్‌షాప్‌లను నిర్వహించడాన్ని  సులభతరం చేసినట్లు చెప్పారు.
ప్రత్యేకంగా రీయింబర్స్‌మెంట్..
ఎగుమతిదారులకు రీయింబర్స్‌మెంట్ లభిస్తుందని, దేశవ్యాప్తంగా 65 ఎగుమతి సులభతర కేంద్రాలు (ఈ ఎఫ్ సి) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ. 12,788 కోట్లు కేటాయించామని.. అనేక పథకాల ద్వారా ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని, వాణిజ్య, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. 
టెక్స్‌టైల్స్ రంగoలో కొన్ని వస్తువులను ప్రోత్సహించడానికి రాష్ట్ర, కేంద్ర పన్నులను 2019 నుండి అమలు చేస్తున్నామని, 
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ( ఎఫ్ టి ఏ )పెంచేలా..ప్రోత్సహిస్తున్నామని అన్నారు. 
ప్రతి జిల్లాలో ఇలా..
ప్రతి జిల్లాలో ఎగుమతి సంభావ్యత ఉన్న ఉత్పత్తులను గుర్తి0చి,  ఎగుమతి చేయడం, ఉపాధిని కల్పించడానికి స్థానిక ఎగుమతిదారులు, తయారీదారులకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ట్రేడ్ కనెక్ట్ ఇప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించబడిందని, అంతర్జాతీయ వాణిజ్యంపై సమగ్ర సమాచారం అందిస్తూ.. నిరంతరం ప్రోత్సహిస్తున్నామని ఖమ్మం ఎంపీకి వివరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .