అమృత్,సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరుపట్లేదు ?

మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే కేంద్రమే  కాపాడుతుందని ఆరోపణ 

అమృత్,సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరుపట్లేదు ?

-బీఆర్‌ఎస్‌ కేడర్‌లో విశ్వాసం, ఆత్మస్థయిర్యం కనిపిస్తోంది 

-ప్రభుత్వం పెట్టి కేసులకు భయపడేది లేదు 

-ఈ-కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో తాను ఎక్కడ మాట మార్చలేదు 

-చెప్పినదానికే కట్టుబడి ఉన్నాను 

-ఈ-కార్‌ రేసు విషయంలో మంత్రి హోదాలోనే తానే డబ్బులు చెల్లించమన్నానని స్పష్టం 

-నిబంధనల ప్రకారం జరుగకపోతే ఈసీ,ఆర్‌బీఐ వద్దకు ప్రభుత్వం ఎందుకు వెళ్లలేదని ప్రశ్న

-మాజీ మంత్రి,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 


హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరపదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే.. కేంద్రమే కాపాడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని విమర్శలు చేశారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా కమిటీలు వేస్తామని కేటీఆర్ తెలిపారు.

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి స్పందించారు. తనకు ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమని అన్నారు. తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పసలేని కేసులు పెట్టరాని మండిపడ్డారు. ఏసీబీ కేసులో బలం లేదని సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అని చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని తెలంగాణ హైకోర్టులో క్వాష్ వేశానని... తాను ఆశావాదిని అని తెలిపారు. హై కోర్టులో ఏం జరుగుతుందో.. రేపు తెలుస్తుందన్నారు. కేసులను లీగల్ గానే ఎదుర్కొంటానని. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను మాట మార్చలేదని. ఈ కేసులో మెదటిరోజు చెప్పి‌న దానికి కట్టుబడి ఉన్నానని తేల్చిచెప్పారు. ఫార్ములా ఈ రేసుకు మంత్రి హోదాలోనే తానే డబ్బులు కట్టామన్నానని తేల్చిచెప్పారు. ప్రొసీజర్ ప్రకారం జరగకుంటే.. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్, ఆర్బీఐ దగ్గరకు ఎందుకు పోలేదని ప్రశ్నించారు. కట్టిన ప్రతి పైసకు లెక్క ఉందని స్పష్టం చేశారు. డబ్బులు ముట్టినవారిపై కేసులు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ ఏడాది చివరకు బీఆర్ఎస్ క్యాడర్‌లో విశ్వాసం, ఆత్మసైర్యం కన్పిస్తోందని చెప్పారు.

2024లో ప్రతికూలతలను తట్టుకుని నిలబడ్డామన్నారు. 2024 కాంగ్రెస్ ప్రభుత్వ ఢోకా నామ సంవత్సరమని ఆరోపించారు. 2004లో బీఆర్ఎస్ పార్టీకి కొంత గడ్డు కాలం నడిచిందని అన్నారు. హామీల అమల్లో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో నిరాశ కన్పిస్తుందని చెప్పారు. హామీలపై పెట్టుకున్న డెడ్‌లైన్లు కాంగ్రెస్‌కు శాపంగా మారాయని విమర్శించారు. కొత్త ఏడాదిలో రైతులను మోసం చేయటానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏడాది చివరకు బీఆర్ఎస్ క్యాడర్‌లో విశ్వాసం, ఆత్మసైర్యం కన్పిస్తోందని అన్నారు. 2024లో ప్రతికూలతలను తట్టుకుని నిలబడ్డామన్నారు. ఎప్పుడు బయటకు రావాలో మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు అని చెప్పారు. 24ఏళ్లు కేసీఆర్ కష్టపడ్డారని... కాస్త రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపారు.


తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరని ప్రశ్నించారు. మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావుకు గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుందని అన్నారు. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారని ఆరోపించారు. 
అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరపదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే.. కేంద్రమే కాపాడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని విమర్శలు చేశారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా కమిటీలు వేస్తామని అన్నారు. కోర్టులో కేసులు వేయించి లోకల్ బాడీస్‌లో బీసీల రిజర్వేషన్లు కోత విధించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. లోకల్ బాడీస్‌లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు వదిలేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .