జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా.

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా.

ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా లావుడియా రాజు నాయక్.

హాసన్ పర్తి,నవంబర్ 26(తెలంగాణ ముచ్చట్లు):

ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టిడబ్ల్యూజేయు) రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాదులోని గిరిజన విద్యుత్ భవన్ లో  కోర్ కమిటీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గా లావుడియా రాజు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా లావుడియా రాజు నాయక్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నియమించినందుకు రాష్ట్ర యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని, జర్నలిస్టుల సమస్యలను ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర కమిటీ ద్వారా అందరి సహకారంతో  జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పనిచేస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .