మహిళల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం : రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు, ఐపీఎస్
రాచకొండ కమిషనర్, సెప్టెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని షీ టీమ్స్ కఠిన చర్యలు కొనసాగిస్తున్నాయి. “మహిళలు ఎక్కడైనా, ఎప్పుడైనా భయపడకుండా తిరగాలి. వారిని వేధించే వారికి రాచకొండలో చోటు లేదు” అని సీపీ జి.సుధీర్ బాబు, ఐపీఎస్ హితవు పలికారు.15 రోజుల్లో 310 ఈవ్‌టీజర్ల అరెస్టు
గత పదిహేను రోజుల్లో షీ టీమ్స్ మఫ్టీలో తిరుగుతూ, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాయి. ఈ క్రమంలో మహిళలు, బాలికలను వేధిస్తున్న 310 మంది(మేజర్స్–181,మైనర్స్–129)
పోకిరీలను పట్టుకొని న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి, ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా హెచ్చరించారు.ఫిర్యాదుల గణాంకాలు ఈ నెల 1 నుండి 15 తేదీ వరకు షీ టీమ్స్‌కి 339 ఫిర్యాదులు అందాయి.
ఫోన్ ద్వారా వేధింపులు – 64
సోషల్ మీడియా యాప్‌ల ద్వారా వేధింపులు – 117 ,ప్రత్యక్ష వేధింపులు – 158,వాటిలో 7 క్రిమినల్ కేసులు, 98 పెట్టి కేసులు నమోదు కాగా, 210 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
సంచలనాత్మక కేసులు
మహిళ గోప్యతకు భంగం: ఇంటి వెంటిలేటర్ ద్వారా స్నానం చేస్తున్న మహిళ ఫోటోలు తీసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు.హాస్టల్ వద్ద అసభ్యకర ప్రవర్తన: బైక్‌పై వచ్చిన యువకుడు తన ప్రైవేట్ పార్ట్స్ చూపుతూ విద్యార్థినిని వేధించగా, షీ టీమ్స్ అదుపులోకి తీసుకుంది.
బంధువు వేధింపులు: ఇప్పటికే వివాహితుడైన దూరపు బంధువు యువతిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తూ ఇబ్బంది పెట్టగా కేసు నమోదు చేశారు.బస్టాండ్ న్యూసెన్స్: ఎల్‌బీ నగర్ బస్టాండ్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకున్నారు.అవగాహన కార్యక్రమాలు మహిళలపై నేరాలు నివారించేందుకు షీ టీమ్స్ విద్యార్థులు, ప్రజలలో విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. ఈ నెల 1 నుండి 15 తేదీ వరకు 79 కార్యక్రమాలు నిర్వహించి, 17,450 మందికి పైగా మహిళా చట్టాలు, వారి హక్కులు, జాగ్రత్తలు, భద్రతా చర్యలపై వివరించారు.మెట్రో రైళ్లలో ప్రత్యేక ఆపరేషన్లు మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించిన షీ టీమ్స్ మహిళల కోసం కేటాయించిన కంపార్ట్‌మెంట్ల లోకి ప్రవేశించిన 7 మంది పురుషులను పట్టుకుని, మెట్రో అధికారుల ద్వారా జరిమానా విధించారు.మహిళలు వేధింపులకు గురైతే నిర్భయంగా రాచకొండ షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 8712662111 ద్వారా లేదా ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు క్రింది నంబర్లకు సంప్రదించవచ్చు :బోనగిరి ఏరియా 8712662598,చౌటుప్పల్ ఏరియా 8712662599,ఇబ్రహీంపట్నం ఏరియా 8712662600,కుషాయిగూడ ఏరియా 8712662601, ఎల్బీనగర్ ఏరియా 8712662602,మహేశ్వరం ఏరియా 8712665299,మల్కాజ్గిరి ఏరియా 8712662603,వనస్థలిపురం ఏరియా 8712662604,యాదాద్రి ఏరియా 8712665300.ఈ కార్యక్రమం లో డీసీపీ టి.ఉషారాణి,ఏసీపీ పల్లె వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ ఎం.ముని, జి.అంజయ్య, ఎస్‌ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సెలర్లు పాల్గొన్నారు.


Comments