రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తరణకు కృషి.

మంత్రి తుమ్మల.

రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తరణకు కృషి.

అశ్వారావుపేట, అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):

దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పామాయిల్ రైతుల సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ, పూజ్యులైన ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా నాటిన పామాయిల్ మొక్క నేడు వేలాది కుటుంబాలకు ఆర్థిక బలం అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పామాయిల్ సాగు విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా పామాయిల్ రైతుల అభివృద్ధి కోసం తన కృషి కొనసాగించానని గుర్తుచేశారు.

అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ఆధారంగానే గెలల ధర నిర్ణయం జరుగుతోందని పేర్కొన్నారు. 15 వేల ఎకరాలకుపైగా పామాయిల్ సాగు ఉన్న ప్రాంతాల్లో కొత్త ఫ్యాక్టరీల స్థాపనకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం పూర్తికి చేరుకుందని, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించారు.

రైతులు అంతర పంటలుగా కోకో, జాజి, వక్క, అవకాడో వంటి పంటలను సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని మంత్రి సూచించారు. దేశం లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే వంట నూనెలను దిగుమతి చేసుకుంటోందని, పామాయిల్ సాగు పెంపుతో ఆ భారాన్ని తగ్గించవచ్చని అన్నారు.

పామాయిల్ రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కార్బన్ క్రెడిట్ పథకం కింద నిధులు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పామాయిల్ గెలలు టన్నుకు ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధరగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతి ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణకు ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారె ఆదినారాయణ, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, “వ్యవసాయమే ఊపిరిగా భావించే తుమ్మల నాగేశ్వరరావు గారికి వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతలు రావడం రైతులకు శుభసూచకమని” అన్నారు. వరి స్థాయిలోనే పామాయిల్ సాగు విస్తరణకు మంత్రి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు సమ్మేళనానికి తరలి వచ్చి మంత్రి తుమ్మలను ఘనంగా సన్మానించారు.IMG-20251004-WA0062

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .