బియ్యంలో పురుగులు  విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు

ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేసిన ఉన్నికృష్ణన్

బియ్యంలో పురుగులు  విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు

మేడ్చల్, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంలో పురుగులు, దుమ్ము, చెత్త కలిసివున్నట్లు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఆరోపించారు.
ఇలాంటి నాసిరకమైన బియ్యంతో విద్యార్థులకు భోజనం వండితే వారి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నికృష్ణన్ హెచ్చరించారు.“విద్యార్థులు అనారోగ్యానికి గురైతే దానికి బాధ్యత ఎవరి మీద?” అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని, ఈ నిర్లక్ష్య వైఖరి కొనసాగితే జిల్లా స్థాయిలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు.ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఉన్నికృష్ణన్ డిమాండ్‌ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .