సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా వై. విక్రమ్

తిరిగి పార్టీలో నియోజకవర్గం డివిజన్ కమిటీలు పునర్దన...

సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా వై. విక్రమ్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై. విక్రమ్ ఎన్నికయ్యారు. ఆదివారం ఖమ్మం నగరంలోని సెయింట్ మేరీస్ స్కూల్ లో సీపీఎం ఖమ్మం డివిజన్ మహాసభ ఘనంగా జరిగింది. ఏకగ్రీవంగా 
మహాసభల్లో విక్రమ్ ఎన్నికయ్యారు.ఖమ్మం నియోజకవర్గం రాజకీయాల్లో జిల్లా పార్టీ సూచనలు మేరకు తనదైన శైలిలో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారు.పాఠశాల స్థాయిలోనే విద్యార్థి సమస్యలపై పోరాడేందుకు ఎస్ఎఫ్ఐ ను వేదికగా చేసుకున్నారు. ఇంటర్మీడియట్  ఖమ్మంలోని సిద్ధారెడ్డి కాలేజీలో చేరి ఇక్కడ  ఎస్ఎఫ్ఐ కి  కళాశాల ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. తర్వాత ఖమ్మం టౌన్ ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడుగా పని చేశారు నిత్యం విద్యార్థులతో మమేకమవుతూ విద్యారంగ సమస్యలపై  పోరాడేవారు. 2000 సంవత్సరంలో సిపిఎం పార్టీ సభ్యునిగా  సభ్యత్వం తీసుకున్న విక్రమ్, ప్రజా సమస్యల పరిష్కారం కోసం  నిత్యం పోరాటాలనే మార్గంగా ఎంచుకున్నారు.
2002 సంవత్సరంలోనే ఈయనపై రౌడీషీట్ ఓపెన్ చేసి ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలకు గురిచేసింది. 2002 నుంచి డివైఎఫ్ఐ టౌన్ అధ్యక్షుడుగా, టౌన్ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో పేదలకు ఇళ్లస్థలాల కోసం ఖమ్మం నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆమరణ నిరాహార దీక్షలో నాయకులు యర్రా శ్రీకాంత్ తో పాటు ,  డివైఎఫ్ఐ ఖమ్మం టౌన్ కార్యదర్శిగా వున్న విక్రమ్ సైతం పాల్గొని దీక్ష చేశారు. పార్టీ నిర్ణయం మేరకు 2005 సంవత్సరంలో సిపిఎం టూ టౌన్ కార్యదర్శిగా  ఎన్నికయ్యారు. నాటి నుండి 10 ఏళ్ల పాటు ఆ బాధ్యతల్లో కొనసాగుతూ నగరంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశాడు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో 2000లో జరిగిన విద్యుత్ ఉద్యమం జిల్లా సిపిఎం పార్టీకి ఎప్పటికీ మరువలేనిది. ఆనాడు ఎస్ఎఫ్ఐ నాయకుడిగా వున్న  విక్రమ్ విక్రమ్ విద్యుత్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు .మయూరి సెంటర్ లో జరిగిన లాఠీఛార్జ్ లో గాయపడ్డాడు.వరంగల్ జైలుకు వెళ్లి వచ్చారు. 2014 సంవత్సరంలో జరిగిన భూ పోరాటంలో పాల్గొన్న విక్రమ్ రెండుసార్లు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు.బిజెపి, అనుబంధ సంఘాలు ప్రజల ఆహారపు అలవాట్లపై సాగిస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా 2014లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో  పెద్దకూర పండగ నిర్వహించారు. దీనిలో విక్రమ్ కీలకంగా వ్యవహరించడంతో, ఆగ్రహంతో ఆనాడు బిజెపి శ్రేణులు విక్రమ్ స్వగ్రామం  రావినూతలలోని  ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించాయి. గత ప్రభుత్వంలో అనేక ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు అక్రమ కేసులు మొత్తం 14 కేసులు విక్రమ్ పై పోలీసులు నమోదు చేశారు. ఖమ్మం కొత్త బస్టాండ్ నిర్మాణంలో, పాత బస్టాండ్ ను  తిరిగి ఓపెన్ చేయడంలోనూ అనేక పోరాటాలు చేశారు. కొత్త బస్టాండ్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై  చేసిన పోరాటాలు చేశారు.సోషల్ మీడియా వేదికగా విక్రమ్ సంధించే  ప్రశ్నలు నేటి రాజకీయ వ్యవస్థ పై  ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి.పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా  సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని  వారియర్ లా పార్టీ కోసం పని చేస్తున్నాడు. నేటి యువతను సిపిఎం పార్టీ పట్ల ఆకర్షితులను చేసే విధంగా  సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగిస్తున్నారు.2002లోనే  ఖమ్మం నగరంలో మంతెన సత్యనారాయణరాజుతో ప్రజలకు ప్రకృతి ఆహారపు అలవాట్లపై చైతన్య కార్యక్రమాలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించేవాడు. నాలుగేళ్లపాటు  ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. 2003 వ సంవత్సరంలో చేగువేరా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు 2004 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా  గ్రామీణ క్రీడలు ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహించారు.2017 నుండి బోడెపుడి విజ్ఞాన కేంద్రంతో కలిసి  సిపిఎం టూ టౌన్ కమిటీ  ఆధ్వర్యంలో ప్రతినెల మొదటి శనివారం మెడికల్ క్యాంపును నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. బిపి, షుగర్ పేషెంట్లకు నెలకు సరిపడా మందులను కేవలం  100 రూపాయలకి అందిస్తూ పేద మధ్యతరగతి వందలాది కుటుంబాలకు ఈ క్యాంపు ఉపయోగపడుతుంది  . ఈ మెడికల్ క్యాంపులో ప్రతినెల సుమారు  700 మంది వైద్య సేవలను పొందుతున్నారు. బీపీ, షుగర్ మాత్రమే కాకుండా ప్రతినెల ఖమ్మం లోని ప్రముఖ హాస్పిటల్ వైద్యుల సహాయంతో ఇతర వైద్య సేవలు అందిస్తూ ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా వుంటా నేడు ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ  ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ మరింతగా పెరగటానికి కృషి చేస్తానని తెలిపారు. ఖమ్మం మాజీ ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం, నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్ సూచనలు మేరకు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అధిక స్థానాల్లో గెలవడానికి తగిన ప్రణాళిక రూపొందిస్తామని ఈ సందర్భంగా వై విక్రమ్ పేర్కొన్నారుWhatsApp Image 2024-12-08 at 10.01.27 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .