యాదవులకు జనాభా ప్రాతిపదికగా చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలి
అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వక్తల డిమాండ్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
బీసీ కులాలలో అధిక జనాభా గలిగిన యాదవులను పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని, గద్దెనెక్కిన తర్వాత యాదవులకు పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ విషయాన్ని సహించేది లేదని, భవిష్యత్తులో ఇదేవిధంగా నిర్లక్ష్యం చేస్తే ప్రతిఘటన తప్పదని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి రమేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ యాదవ్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పార్టీలను ఉద్దేశించి హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ శుభం కన్వెన్షన్ హాల్ లో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణ జనాభాలో దాదాపు 20 శాతం ఉన్న యాదవులకు చట్ట సభలలో గాని రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులలో గాని, జిల్లాస్థాయి పదవులలో గాని నేటి ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదని, గత ప్రభుత్వంలోనే కనీసం గుడ్డిలో మెల్లగా అన్నట్లు అవకాశాలు వచ్చాయని, ఈనాటి అధికారపార్టీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని, ఇదే విధంగా కొనసాగితే రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో తమ సత్తా చూపక తప్పదని, వెంటనే రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను, జిల్లాస్థాయి పదవులను ప్రకటించాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో యాదవులకు గొర్రెలకు బదులు నగదు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, 50 సంవత్సరాలు నిండిన గొర్రెల పెంపకం దారులకు ఆసరా పెన్షన్ కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యవర్గ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతల రవీందర్ యాదవ్, ఈశ్వరమ్మ, మహబూబ్ నగర్ నుండి శ్రీనివాస్ యాదవ్, మేకల రాజేందర్, బొంతు శ్రీదేవి యాదవ్, గొర్ల యశ్వంత్, బమ్మిడి శ్రీనివాస్ పోచబోయిన శ్రీహరి, మైల్ కోల్ మహేందర్, శేఖర్ యాదవ్, యడ్ల హరిబాబు, తోడేటి లింగరాజు, పల్లెబోయిన శ్రీనివాస్ వేల్పుల రవికుమార్, మేకల మల్లికార్జునరావు మరియు జిల్లాల నుండి యాదవ మహాసభ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.


Comments