యోగా మనసు–శరీర సమతుల్యతకు మార్గం

యోగా మనసు–శరీర సమతుల్యతకు మార్గం

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 11, తెలంగాణ ముచ్చట్లు:

యోగా మనిషి జీవితాన్ని సమతుల్యం చేసే శాస్త్రం అని శ్రీ ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ పేర్కొన్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రతిరోజూ యోగా సాధన చేస్తే శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయనీ, ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే ఉత్తమ మార్గం యోగ  అని ఆయన చెప్పారు.  ప్రతిరోజూ కొద్ది నిమిషాలు యోగా అభ్యాసం తప్పనిసరి చేస్తే, విద్యార్థుల మానసిక–శారీరక అభివృద్ధి సహజంగా జరుగుతుందన్నారు. యోగా గురువు ఆత్మకూరి నాగేశ్వరరావు విద్యార్థులకు సూర్యనమస్కారాలు, ప్రాణాయామ పద్ధతులను ప్రదర్శించారు. ‌ ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు రేణుక, అమరబోయిన సురేష్ , శ్రీనివాస్, ప్రశాంతి, పుల్లారావు, సుధాకర్, పార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20251011-WA0018

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .