కోదాడ,హుజర్నగర్ నియోజకవర్గాల అంతర్గత రహదారులకు మహార్దశ

-37.60 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్

కోదాడ,హుజర్నగర్ నియోజకవర్గాల అంతర్గత రహదారులకు మహార్దశ

హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాలపై కొనసాగుతున్న కెప్టెన్ మార్క్ అభివృద్ధి.

-40 కోట్ల నిధులు మంజూరు చేయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతీలు 

-హుజుర్నగర్ నియోజకవర్గ గ్రామీణ రహదారులకు 25 కోట్లు

-కోదాడ గ్రామీణ రహదారులకు 15 కోట్లు

-గ్రామీణ రహదారులపై మంత్రి ఉత్తమ్ ప్రత్యేక దృష్టి


-ప్రజల అభ్యర్థనకు ప్రతిస్పందన

-హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాలపై కొనసాగుతున్న కెప్టెన్ మార్క్ అభివృద్ధి.


హుజూర్ నగర్/కోదాడ,తెలంగాణ ముచ్చట్లు:

హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గల పరిధిలోని గ్రామాలలో అంతర్గత రహదారులకు  మహర్దశ పట్టింది. దశాబ్దకాలంగా కనీసం మరమ్మతులకు కుడా నోచుకోని ప్రాంతాల్లో కొత్తగా రోడ్డు నిర్మాణాలకు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉపక్రమించారు. ఆ రెండు నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధి పై మరోసారి మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు.ఏకంగా 40 కోట్ల నిధులను మంజూరు చేయిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేయించారు.  

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంలో బాగంగా జీ. ఓ.నెంబర్ 593(11/10/2024) విడుదలైన ఉత్తర్వులలో ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలలో 37.60 కిలోమీటర్ల నూతన రహదారుల నిర్మాణాలు చేపట్టనున్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గానికి 25 కోట్ల నిధులు మంజూరు కాగా ఉత్తమ్ పద్మావతీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గానికి 15 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో 23.90 కిలోమీటర్లు మేర అంతర్గత రహదారులు నిర్మించనున్నారు.నియోజకవర్గ పరిధిలోని గడ్డిపల్లి బరెల్ గ్రౌండ్ నుండి బొలిశెట్టి గూడెం మీదుగా కొనాయిగూడెం వరకు 7 కిలోమీటర్ల దూరం నిర్మించనున్న బి.టి.రోడ్ కు రూ.7.20 కోట్లు ,గరిడేపల్లి నుండి సీతారాంతండా వరకు 5 కిలోమీటర్ల కు గాను రూ.5.10 కోట్లు ,నెరేడుచర్ల మండలం దిర్శించర్ల  నుండి ముత్యాలమ్మ కుంట మీదుగా చిట్టివారిగూడెం వరకు 2.90 కిలో మీటర్ల కు గాను రూ.3.20 కోట్లు, మఠం పల్లి మండలం కామాక్షికుంట తండా నుండి చెన్నాయిపాలెం వరకు 2 కిలోమీటర్లకు గాను రూ.2.20 కోట్లు, అదే మండలం బక్కమంతులగూడెం నుండి అల్లిపురం వరకు 3 కిలో మీటర్లకు గాను రూ.3.10 కోట్లు,చౌటపల్లి మండలం అల్లిపురం వరకు 4 కిలోమీటర్లకు గాను రూ.4.20 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

అదే విదంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలం నాయకుగూడెం నుండి విబలాపురం వరకు 3.20 కిలో మీటర్లకు గాను రూ.3.50 కోట్లు, అదే మండలం అన్నారిగూడెం మఱ్ఱి చెట్టు నుండి కరక్కాయలగూడెం వరకు 2 కిలోమీటర్ల దూరానికి గాను రూ.2.30 కోట్లు, నడిగూడెం మండలం వల్లాపురం నుండి కేశవాపురం వరకు 2 కిలోమీటర్లకు గాను రూ.2.00 కోట్లు, నారాయణపురం నుండి కే.ఆర్.సి పురం వరకు 3.40 కిలోమీటర్లకు గాను రూ.3.20 కోట్లు, మోతె మండలం నామావరం నుండి సీతానగరం వరకు 4 కిలో మీటర్ల దూరానికి గాను రూ.4.00 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ వెల్లడించారు.

ఇటీవల కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలకు అంతంత మంత్రాంగ ఉన్న గ్రామీణ అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిన్న నేపద్యంలో స్థానిక ప్రజలు,ప్రజాప్రతినిధులు సంయుక్తంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ దృష్టికి తీసుక రాగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో యుద్ద ప్రాతిపదికన అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించి అంచానలు రూపొందించి నిధులు మంజూరు చేయించారు. రెండు నియోజకవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల అంతర్గత రహదారుల నిర్మాణాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేయించడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .