స్టేట్ లెవల్ బాక్సింగ్ విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు

స్టేట్ లెవల్ బాక్సింగ్ విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  ఇటీవల ఎస్జిఎఫ్ఐ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో విజేతలైన హసన్పర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సత్కరించారు.

గోల్డ్ మరియు బ్రాంజ్ మెడల్ విజేతలు చెంగల లక్ష్మణ్: 10వ తరగతి విద్యార్థి, గోల్డ్ మెడల్ విజేత, డిసెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు U-17 విభాగంలో ఎంపిక.జన్ను నిషాంత్ బ్రాంజ్ మెడల్ విజేత.
విద్యార్థులను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు వారికి అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల అవసరాలను తీర్చడానికి తన పూర్తిస్థాయి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు

హసన్పర్తి మండల పరిధిలో క్రీడాకారుల అవసరాల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణ పూర్తి అయినట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత నిధుల నుంచి క్రీడాపరికరాలు అందించేందుకు సిద్ధమని చెప్పారు.

క్రీడా కోచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ప్రశంసలు WhatsApp Image 2024-11-29 at 9.27.29 PM విద్యార్థులను ఈ స్థాయికి తీసుకువచ్చిన కోచ్ పార్థసారథి (పి.డి) మరియు ప్రిన్సిపాల్ రమాదేవిలను  ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 66వ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, బాక్సింగ్ అసోసియేషన్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సుభాస్ రెడ్డి, నాయకులు నర్సింహులు, వెంకటస్వామి, శ్రీనివాస్, నరేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .