పీవీ విజ్ఞాన కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలి
- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ:
నూతనంగా నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రంలో ఆడిటోరియం, యాంపి థియేటర్, సైన్స్ మ్యూజియం, గ్యాలరీ, మెడిటేషన్ సెంటర్, క్రీడా స్థలం, విగ్రహాలు, తదితర పనులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నాణ్యతగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర లోని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారకార్థం నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రంలో నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను అధికారులను, సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులను వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పనులకు సంబంధించి కలెక్టర్ పలు సూచనలు, సలహాలు చేశారు.
కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పివి విజ్ఞాన కేంద్రంలో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అనంతరం వంగరలోని ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కేంద్రంలోని ఎక్స్ రే యంత్రం పనిచేయకపోవడంతో దానిని మరమ్మతు చేసేందుకు తగిన ప్రతిపాదనలు తయారుచేసి పంపించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
అదేవిధంగా భీమదేవరపల్లి లోని కస్తూర్బా బాలికల పాఠశాల, కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ విద్యాసంస్థలోని తరగతి గదులు, కిచెన్, పాఠశాల ఆవరణను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా మంజూరైన నిధులతో చేపట్టిన గదుల మరమ్మతు, టాయిలెట్స్ నిర్మాణం, విద్యుత్తు పనులను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు అందిస్తే సంబంధిత పనులను పూర్తి చేసేందుకు నిధులను విడుదల చేసేందుకు చర్యలు చేపడతానని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డీఈవో వాసంతి, డిఎంహెచ్వో డాక్టర్ లలితా దేవి, ఆర్డీవో వెంకటేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments