నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్ర నేత ఏసోబు

నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్ర నేత ఏసోబు

6bc89673-ec29-4020-afc8-aadecead644eకాజిపేట్ ,తెలంగాణ ముచ్చట్లు:

మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర చత్తీస్గడ్ బార్డర్ ఇంచార్జ్ మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా బీజాపూర్ -- దంతేవాడ మధ్య జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు దంతేవాడ పోలీసులు తెలిపారు. ఏసోబు స్వగ్రామం తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం గ్రామానికి చెందినవాడు. ఇతనికి భార్య మృతి చెందగా ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దొరల ఆగడాల ను తట్టుకోలేక వాళ్ళ దౌర్జన్యాలను ఎదిరిస్తూ 1990 లో మావోయిస్టు పార్టీలో చేరారు. అప్పటినుండి పార్టీలో చురుకైన పనితీరును కనిపిస్తూ అంచలంచలుగా ఆ పార్టీలో ఎదిగాడు. అన్యాయాలను అక్రమాలను తీవ్రస్థాయిలో ఎదిరిస్తూ ఎన్నో పోరాటాలను చేసిన చరిత్ర ఏసోబుకు ఉన్నది పార్టీలో మంచి గుర్తింపును తెచ్చుకొని వివిధ పదవులను చేపట్టితో పార్టీకి అటు అణగారిన ప్రజలకు తన సేవలను ఎంతగానో అందించారు. అతని మృతదేహాన్ని నేడు తన స్వగ్రామమైన టేకుల గూడెం కు తీసుకురానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .