వన్యప్రాణుల చిత్రవిభాగంలో సంపత్ కు పురస్కారం
Views: 3
On
ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు విభాగాల్లో ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించారు. ఖమ్మానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ చావా సంపత్ కుమార్ తీసిన చిత్రాలకు నేచర్ వైల్డ్ లైఫ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. ఈ ఫోటోగ్రఫీ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ పోటీలకు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉపకులపతి కె. గంగాధర్ రావు విజేతలను గురువారం ప్రకటించారు. ఈనెల 19వ తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో సంపత్ ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. ఈ సందర్భంగా సంపత్ ను పలువురు అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments