కాల్వ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి

- 24 గంటల పాటు పనులు జరగాలి

కాల్వ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి

- తెలంగాణ రెవెన్యూ , హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పునరుద్ధరణ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ఆదివారం మంత్రి పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి ప్రదేశంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల తీరును పరిశీలించారు. 

పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక వివరాలు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వత పునరుద్ధరణ పనులు, మొదలగు పనుల వాటిపై అధికారులతో మాట్లాడి, ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన పనులలో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి సూచించారు. గండి పూడిక పనులు 24 గంటల పాటు జరగాలని, అవసరమైన మేర అదనపు యంత్రాలు, షిఫ్టులవారీగా కార్మికులు పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని, కాల్వ తవ్వకం, లైనింగ్ పనులు సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  

మంత్రి పర్యటన సందర్భంగా ఇరిగేషన్ సిఇ విద్యాసాగర్, ఎస్ఇ నర్సింగ రావు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .