రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నంటిని త్వరితగతిన పూర్తి చేస్తాం
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Views: 7
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం ప్రజలకు అంకితం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల సహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో ఇతర జిల్లాల నుంచి కూడా ప్రాజెక్టుల పూర్తికి ఒత్తిడి పెరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అన్ని జిల్లాల్లోని రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments