గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

 -ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ లో వైద్యం  

గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

-కోలుకుంటోన్న ములుగు విద్యార్థిని కార్తీక

తెలంగాణ ముచ్చట్లు డెస్క్: పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. 

సీఎం సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని కోలుకుంటోంది. 

ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. దీంతో నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గురుకుల అధికారులు విద్యార్థినిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కి, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ గారి బృందం మంగళవారం నాడు కార్తీకకు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయులో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

కార్తీక కు కావాల్సిన వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారితో మాట్లాడి కార్తీక కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .