సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి - వీలైనంత త్వరగా పూర్తి చేయండి

రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ

సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి - వీలైనంత త్వరగా పూర్తి చేయండి

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

గ్రాంట్ల రిలీజ్ చిక్కులతో అడ్వయిజరీ జారీ

కసరత్తు మొదలు పెట్టిన రాష్ట్ర అధికారులు

పంద్రాగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఆ తర్వాతే స్థానిక సమరంపై మరింత క్లారిటీ

రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ లేఖ రాసింది. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ ఉండడం అనివార్యం కావడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్టు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే సారి నిర్వ హించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ చిక్కు లున్నందున రాష్ట్ర బీసీ కమిషన్, పంచాయ తీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు. ఆ మూడు విభాగాల అధికారులకు వర్క్ డివిజన్ చేసి వీలైనంత తొందరగా ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక సీఎం విదేశీ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది.*

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .