మహిళా లోకానికి రాఖీ శుభాకాంక్షలు

మహిళలను మహరానులుగా చూడటమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మహిళా లోకానికి రాఖీ శుభాకాంక్షలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మ కు ఇందిరమ్మ రాజ్యం లో ఏర్పడిన  ప్రజా ప్రభుత్వం పెద్దన్నగా అండగా ఉంటుందని తెలిపారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా ...వారి రక్షణే ధ్యేయంగా ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు మహిళలకు మాట ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా పథకాన్ని ప్రారంభించిందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను మహిళలకు అందిస్తున్నదనీ చెప్పారు. అదే విధంగా డ్వాక్రా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చామన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఈ ఐదు సంవత్సరాలలో వడ్డీ లేని రుణాలు లక్ష కోట్ల రూపాయలు అందిస్తామన్నారు. మహిళలను మహాలక్ష్మి గా మా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.  

ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఎప్పుడు అండగా ఉంటామని, రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీ సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .