జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు

కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జర్నలిస్టులు సంక్షేమం

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు

-రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

తమ ప్రభుత్వం జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కారించి, వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ వెనుకడుగు వేయలేదని, నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు.

🔹 ఇండ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను ముఖ్యమంత్రి గారు జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ (మ్యాక్‌) హౌసింగ్ సొసైటీకి అప్పగించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ప్రజా ప్రభుత్వానికి ఈ సందర్భంగా పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున చెక్కులను సీఎంగారు పంపిణీ చేశారు. 

🔹 ప్రజాభిప్రాయం, పాత్రికేయుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అని చెప్పారు.

🔹 ఒకప్పుడు రాజాకీయ పార్టీలు తమ సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి, కానీ ఇప్పుడు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

🔹 "వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు. అది మనకు మనమే పెంచుకోవాలి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు అనే పదానికి అర్ధాన్నే మార్చేస్తున్నారు. ఉన్మాదంతో వ్యవహరించే అలాంటి వారిని నియంత్రించే బాధ్యత కూడా జర్నలిస్టులపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది" అని ముఖ్యమంత్రి అన్నారు.

🔹 జర్నలిజం ముసుగులో కొందరు రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని చెప్పారు.

🔹 జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడిటేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్ నుంచి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇండ్ల స్థలాల విషయంలో మిగతా జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు.

🔹 ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు.

*ఎవరు జర్నలిస్టులు.....?* 

 *అసలు కంటే కొసరు ఎక్కువైంది* 

 *మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీరే చెప్పండి* 

 *జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండి* 

*యూ ట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు* 

ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరుదే ఎక్కువైందని, ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు.. ఎక్కడపడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. ఎవరేమన్నా అంటే చూశారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు.. జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి.. మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలి మీరే చెప్పండి. మెడలో పట్టీలు వేసుకొని

ఓ ట్యూబ్.. ఆ ట్యూబ్ కు నేను జర్నలిస్టును అని బయలుదేరితే.. వాళ్లు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .