ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 20న మంగళవారం పర్యటించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా తొలుత పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారన్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు ములకలపల్లి మండలం మంగపేట గ్రామంలో పబ్లిక్ హెల్త్ సెంటర్ ను, అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం, వినాయకపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాలపై జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .