విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ లా ఏ నగరము సిద్ధముగా లేదు-సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రముఖ పాలసీమేకర్, జే-పాల్ (J-PAL) సంస్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ ధాలివాల్ (Iqbal Dhaliwal) గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జరుగుతోన్న ఏఐ గ్లోబల్ సదస్సు ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి రాజధానిగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని నిర్మించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు జే-పాల్ సంస్థ ముందుకొచ్చింది.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు, జే-పాల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
జే-పాల్ గా వ్యవహరించే 'అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్' సంస్థ ప్రజల జీవితాలు మెరుగుపర్చే పాలసీల రూపకల్పనలో, శాస్త్రీయ ఆధారాలతో కూడిన డేటా సేకరణలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 దేశాల్లోని ప్రభుత్వాలు, సంస్థలకు 800కుపైగా విధానాలను అందించింది.


Comments