గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (జిఐవో) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పట్టణ శాఖ అధ్వర్యంలో ఆదివారం నాడు ఉర్దూ ఘర్ షాదీ ఖానా నుండి ర్యాలీ నిర్వహంచి నిరసన వ్యక్తం చేశారు అనంతరం నిర్వహించిన సమావేశం గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రిజినల్ ఆర్గనెజర్ హఫ్సా మేహ్వీన్ మాట్లాడుతూ కలకత్తాలో డాక్టర్ మౌమిత అర్ధరాత్రి 36 గంటల వరకు కష్టపడి డ్యూటీ చేసి నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు సభ్య సమాజం తలదించుకొనే విధంగా దారుణంగా అత్యాచారం చేసి దయ కరుణ, జాలి లేకుండా ముక్క ముక్కలుగా చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళలకు రక్షణ లేకపోవడం ముఖ్యంగా మహిళా ఉద్యోగులు డాక్టర్లకి రక్షణ లేకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. అనంతరం జిఐవో పట్టణ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఖదిజతుల్ కుబ్రా దేశంలో నిర్భయ తరువాత దిశ తర్వాత అత్యంత దారుణమైన సంఘటన భారతదేశంలో జరగడం సభ్య సమాజాన్ని తలదించుకునే పరిస్థితిని తీసుకువచ్చిందని,ఇటు వంటి సంఘటనలకు పాల్పడిన వ్యక్తులను నడిరోడ్డులో ఉరితీసి గుణపాఠం చెప్పాలని అటువంటి చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటరీ సీమా నాజినీన్, క్యాంపస్ ఆర్గనైజర్ షిమ్రా , దావా ఆర్గనైజర్ అస్కియ అసఫ్, హలీమ, హఫ్సా సాదియ , షిఫా, నాహియ, ఫరీన అఫ్రీన్, అమ్రీన్ జమాఅతె ఇస్లామి హింద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అస్మా అన్జుమ్, ఖిల్లా అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్ నస్రీన్ , హాజిరా, సీమ, సుమయ్య మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు అత్యాచారం,


Comments