ఖమ్మంలో 'రామ' సహాయక చర్యలు..!
- ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ
- పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా వివరించిన ఆర్ ఆర్ ఆర్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి వాటిని పరిష్కారించేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం నరేష్ రెడ్డి స్వయంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా ఈ రెండు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితిని వివరించారు. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. సహాయ బృందాలను రప్పించి వరదలకు ఇండ్లలో, రహదారుల పై చిక్కుకున్న వారిని కాపాడాలని సూచించారు. ఖమ్మంలోని పెద్దకూరగాయల మార్కెట్, జూబ్లీక్లబ్, కాల్వొడ్డుతో పాటు పాలేరులోని కరుణగిరి, జలగం నగర్, నాయుడుపేట, రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి తదితర గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. వీలైనంత త్వరగా వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు యంత్రాంగం కృషి చేస్తుందని ఎంపీ రఘురాం రెడ్డి తెలిపారు.


Comments