గద్వాల పెద్ద తాండాలో తాగునీటి కొరత!

అధికారులు స్పందించాలని వినతి

గద్వాల పెద్ద తాండాలో తాగునీటి కొరత!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా బారి వర్షాలు పడుతున్న గాని గుక్కెడు తాగునీటీ కోసం ప్రజలు అల్లాడుతున్నారు. చాలా గ్రామాల్లో అష్టకష్టాలు పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజాపాలన అదికారులు గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తాజాగా మల్దకల్ మండలం పెద్ద తాండాలో గత వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షానికి నానుకుంటూ బోరెంగిల దగ్గర, బోర్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటూ ప్రజలు యిబ్బందులు పడుతున్నారు. సమస్య ఎవరికైన చెప్పుకుందామంటే పంచాయతీ ఆఫీస్ 24గంటలు తాళం వేసి ఉంటుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరు, ఎలా ఉంటాడో కుడా గ్రామ ప్రజలకు తెలియదంటున్నారు.ఈ విషయాన్ని స్పందించి పై అధికారులు వెంటనే పెద్ద తాండలో నీటి సమస్య తీర్చాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .