లంబాడిల ఐక్య వేదిక యూత్ వింగ్ జిల్లా ఇంచార్జ్ గా తిరుపతి నాయక్
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హన్మకొండలోని గుండ్ల సింగారం ఇంద్రమ్మ కాలనీకి చెందిన కరంటోత్ తిరుపతి నాయక్ ను లంబాడీ లైవ్ ఐక్యవేదిక హనుమకొండ జిల్లా యూత్ వింగ్ ఇంచార్జి గా నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతి నాయక్ కు నియమాక పత్రాన్ని అందజేశారు.అనంతరం పదవి రావడానికి సహకరించిన వారికీ,వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, స్టేట్ చీప్ కోఆర్డినేటర్ గుగులోతు రమేష్ నాయక్,లంబాడీల ఐక్య వేదిక లైవ్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్, వీరస్వామి బాణోతు రవీందర్ నాయక్, భూక్యా మోహన్, అజ్మీరా వెంకటేష్, స్టేట్ నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా తిరుపతి కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో డిస్టీక్ లెవెల్ లో యూత్ వింగ్ ఇంచార్జి నియమించడం చాలా సంతోషంగా ఉందని, మా బంజారా ముద్దుబిడ్డలకు ఎలాంటి సమస్యలు ఎదురైన ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.


Comments