ప్రభుత్వ భూములు రక్షించడానికి వాడ్రా రావాలి

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం

ప్రభుత్వ భూములు రక్షించడానికి వాడ్రా రావాలి

హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం 65 డివిజన్ ఎల్లాపూర్ గ్రామం తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రేనుకుంట్ల దుర్గాప్రసాద్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ధరణి పేరుతో కోట్ల రూపాయల విలువగల భూములను స్వాధీనపరుచుకున్నారని అన్నారు.ధరణి పేరుతో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కబ్జాలకు పాల్పడడంతో పేదవాడు పేదవాడి గానే ఉన్నాడని గత ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య కారణంగా భూకబ్జాదారులు చెరువులను చెర పెట్టడంతో హనుమకొండ నగరం మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్రానికి అందిస్తున్నారని దాన్ని అంబేద్కర్ సంఘం స్వాగతిస్తుందని ఎందుకంటే పేదవాడికి గత ప్రభుత్వం మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు.పేదవాడికి డబల్ బెడ్ రూమ్ అన్నారు.ఏదీ ఇవ్వకుండా గత ప్రభుత్వంలో అధికారులతో నాయకులు కుమ్మకై భూములన్నీ కాజేశారని అన్నారు. హనుమకొండజిల్లాలో హైడ్రా తరహాలో వాడ్రా రావాలని కోరారు. వాడ్రాతో వచ్చే అధికారులు 1954 నుండి కబ్జా వివరాలకు సంబంధించిన మ్యాపులతో రావాలని భూములను వెనక్కి తీసుకొని కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తులపై కేసు నమోదు చేసి వారికి సహకరించిన అధికారులపై తగిన చర్య తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెలిశోజు రమణాచారి, సహాకార్యదర్శి వెలి సోజు బుచ్చి రాములు, కోశాధికారి ఎర్ర నాగరాజు, నేదునూరి సునీల్, నేదునూరిశ్రీనివాస్, సభ్యులు కొత్త గట్టు శ్యాంసుందర్, గోపరాజు కుమారస్వామి, రేనుకుంట్ల చిరంజీవి, మహ్మద్ పాషా, అజయ్ కుమార్,గాజుల రాజు, వేములపల్లి సురేష్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .