కూతురుతో క‌లిసి యువ జ‌ర్న‌లిస్టు యోగి ఆత్మ‌హ‌త్య‌..!

వ‌రంగ‌ల్ జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో  విషాదం

కూతురుతో క‌లిసి యువ జ‌ర్న‌లిస్టు యోగి ఆత్మ‌హ‌త్య‌..!

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు :వ‌రంగ‌ల్ యువ జ‌ర్న‌లిస్ట్, తొలి వెలుగు చానెల్ స్టాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న యోగి రెడ్డి త‌న‌ కూతురు ఆద్య‌(9)తో క‌లిసి హ‌న్మ‌కొండ ఏక‌శిల పార్కుకు స‌మీపంలోని త‌న ఇంట్లో శుక్ర‌వారం ఉరివేసుకున్నాడు.

 యోగి సంఘ‌ట‌న స్థ‌లంలోనే మృతి చెంద‌గా కూతురు ఆద్య ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది.  ఈ సంఘ‌ట‌న  శుక్ర‌వారం రాత్రి జ‌రిగింది. హ‌న్మ‌కొండలోని ఏక‌శిలా పార్కుకు స‌మీపంలో అద్దె రూంలో ఉంటున్న యోగి..శుక్ర‌వారం ఉద‌యం నుంచే రూం నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని తెలుస్తోంది. శుక్ర‌వారం సాయంత్రం యోగి స‌న్నిహితులు ఆయ‌న ఇంటికి వెళ్లిన స‌మ‌యంలో ఎంత పిలిచినా స్పందించ‌క‌పోవ‌డంతో అనుమానంతో డోర్లు తొల‌గించి చూశారు. యోగి ప్రాణాలు కోల్పోయి క‌నిపించ‌గా, అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఆయ‌న కూతురును కొంత‌మంది జ‌ర్న‌లిస్టులు, స‌న్నిహితులు ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యోగి ఆత్మ‌హ‌త్య‌కు ఎందుకు చేసుకున్నాడ‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. కుటుంబ స‌మ‌స్య‌లే కార‌ణ‌మా..? మ‌రేదైనా ఉందా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .