మైనర్ బాలికపై సిఐ రవికుమార్ అత్యాచార యత్నం
బాలిక తల్లిదండ్రుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన ఖాజీపేట్ పోలీసులు
Views: 1649
On
1.jpeg)
-సిఐ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఓ బాలికపై సీఐ రవికుమార్ అత్యాచారయత్నం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బుధవారం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటికి రాగానే తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పడంతో, హుటాహుటిన వెళ్లి కాజీపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాజంలో అత్యాచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడటం ఏంటని స్థానిక రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సిఐ రవికుమార్ గతంలో మామునూరు,మడికొండ పోలీస్టేషన్ లో విధులు నిర్వహించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments