అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదు
ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి
Views: 15
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఖమ్మం నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అమలుల్లో వున్న సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షల నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఏసీపీ కోరారు.
నిబంధనలు అతిక్రమించి ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరంగా సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments