డీజీపీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న వరంగల్‌ పోలీస్‌ అధికారులు.

.వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు రాష్ట్ర పోలీస్‌ డీజీపీ జితేందర్‌ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. ప్రశంస పత్రాలు అందుకున్న పోలీస్‌ అధికారులు గతంలో పనిచేసిన పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను నియంత్రించడంతో పాటు, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన నేరస్థులకు పది సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడటంలో కృషి చేసినందుకుగాను హైదరాబాద్‌ పోలీస్‌ శాఖ ప్రధాన కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో రాష్ట్ర పోలీస్‌ డీజీపీ చేతుల మీదుగా వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌కు చెందిన పోలీస్‌ అధికారులు ప్రశంస పత్రాలను అందుకున్నారు. ప్రశంస పత్రాలు అందుకున్న వారిలో కెయూసి ఇన్స్‌స్పెక్టర్‌ రవికుమార్‌, సుబేదారి ఇన్స్‌స్పెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి, సంగెం ఎస్‌.ఐ నరేష్, పరకాల హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌ వున్నారు. ఈ సందర్బంగా ప్రశంస పత్రాలను అందుకున్న పోలీస్‌ అధికారులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్  అభినందించారు.WhatsApp Image 2024-11-24 at 3.31.04 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .