2007-08 ఎస్సెస్సి బ్యాచ్ అ'పూర్వ' కలయిక

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

2007-08 ఎస్సెస్సి బ్యాచ్ అ'పూర్వ' కలయిక

-పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

వరంగల్ లోని (కాశీబుగ్గ) నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-08 ఎస్సెస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, విద్యార్థులు తమ పాఠశాల జీవితంలో గడిపిన అపూర్వ క్షణాలను పంచుకున్నారు.ఉదయాన్నే ప్రారంభమైన ఈ సమ్మేళనం వివిధ కార్యక్రమాలతో అలరించింది. పూర్వ విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులతో కలిసి అనుభవాలను పంచుకుంటూ, తమ కెరీర్‌లో సాధించిన విజయాలను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, ఇందులో గానం, నృత్యం వంటి ఎన్నో ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.అతిధులుగా విచ్చేసిన అప్పటి,ఇప్పటి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాఠశాలలో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ, పాఠశాల అభివృద్ధి గురించి వివరించారు. విద్యార్థుల విజయాలను ప్రశంసిస్తూ, పాఠశాల విద్యా ప్రమాణాలు ఎలాగు ఉన్నతంగా నిలిచాయని తెలిపారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల పట్ల ఉన్న కృతజ్ఞతలు తెలియజేస్తూ, పాఠశాల అభివృద్ధి కోసం సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా అందరూ కలిసి విందు భోజనం ఆస్వాదించారు.

ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు దామోదర్, నెహ్రు, రాజు ,శ్రీనిధి ,చంద్రశేఖర్ ,శ్రీమాన్,నారాయణ, ఐళేశ్వర్,మహేశ్వరి,శార్వాణి ,శేషిపని పూర్వ విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .