దేశానికి దిక్సూచి జనసేనాని
జనసేనపార్టీ ఇంచార్జ్ గాదె పృథ్వి
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: జాతీయ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెరగని ముద్ర వేసి దేశానికి దిక్సూచి అయ్యారని జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు,నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి అన్నారు.నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో యన్డిఎ మహాయుతి కూటమి అభ్యర్థుల తరుపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి ప్రచారం చేసిన అన్నీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు.మహారాష్ట్ర రాజకీయ చరిత్రలోనే బీజేపీ ఎప్పుడు గెలవని స్థానాల్లో కూడా అభ్యర్థులను గెలిపించి జాతీయస్థాయిలో రికార్డు సృష్టించారని తెలిపారు.పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహలతో దేశం మొత్తం జనసేన వైపు చూస్తుందన్నారు.జాతీయ రాజకీయాల్లో అధినేత పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారన్నారు.రానున్న రోజుల్లో జనసేన బలమైన పార్టీగా మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన చురుకైన పాత్ర పోషిస్తుందన్నారు.తెలంగాణలో ప్రజల తరుపున జనసేనపార్టీ పోరాడుతుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఆరు గ్యారంటీల అమలుకై జనసేన పోరాటానికై సిద్దమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మహమ్మద్ రజాక్,మునిగాల పవన్,భాషబోయిన సమ్మయ్య,అక్కెనపల్లి సాయి, గ్యార బన్నీ, సంజయ్,ఉస్సన్ తదితరులు ఉన్నారు


Comments