శ్రీ మహంకాళి దేవాలయంలో ఘనంగా 33వ దసరా శరన్నవరాత్రుల పూజలు
నాగారం, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
రాంపల్లి శ్రీ మహంకాళి దేవాలయంలో 33వ దసరా శరన్నవరాత్రుల పూజలు భక్తిపూర్వకంగా నిర్వహించబడాయి. గ్రామ పురోహితులు ప్రధాన అర్చకులుగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాతకు భక్తులకు దర్శనం కల్పించారు.
శ్రీ మహంకాళి అమ్మవారిని శ్రీ స్కందా దేవి అలంకరణలో అలంకరించి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కందాడి శ్రీకాంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ భూమయ్య యాదవ్, కమిటీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి దంపతులను సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను విరాళంగా అందజేశారు.
సాయంత్రం మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎలసాని భూమయ్య యాదవ్, ఉపాధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, కోశాధికారి ఎల్లమయ్య, ఇతర కార్యవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.


Comments