ఎన్నికల హామీల్లో ప్రకారంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్

ఎన్నికల హామీల్లో ప్రకారంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 10, తెలంగాణ ముచ్చట్లు;

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కేబినెట్ లో ఆమోదం పొందుపరిచి బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టిందని కార్పొరేట్, బీసీ సంఘం నాయకులు కమర్తపు మురళీ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిపారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ బీసీ రిజర్వేషన్ కు అడ్డుపడుతుందని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగే ప్రసక్తే లేదని అయన తెలిపారు. కేబినెట్ లో మంత్రులు బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత కోర్టులో పిటిషన్ వేసి వాదులను వినిపించి బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించుకుంటామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ జోహార ఫాతిమా, మార్కెట్ కమిటీ చైర్మన్ యారగర్ల హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .