బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందే.

సీపీఐ(ఎం) హసన్ పర్తి మండల కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందే.

హసన్ పర్తి,అక్టోబర్ 17(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 52 శాతం కాగా రిజర్వేషన్ మాత్రం కేవలం 29 శాతం మాత్రమే ఉండడం తీవ్ర అన్యాయమని సీపీఐ(ఎం) హసన్ పర్తి మండల కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు అన్నారు.శుక్రవారం హసన్ పర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కార్యదర్శి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీసీ హక్కులపై హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తరువాత  విస్మరిస్తున్నాయని విమర్శించారు.సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలను పక్కన పెడితే అభివృద్ధి అసాధ్యమని పేర్కొన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం సాధ్యమని గుమ్మడిరాజుల రాములు స్పష్టం చేశారు.ప్రభుత్వం వెంటనే బీసీల జనాభా లెక్కలు విడుదల చేసి న్యాయమైన రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం) పార్టీ ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాల పక్షాన నిలుస్తుందని, బీసీ హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
  ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) మండల కమిటీ సభ్యులు పుల్ల అశోక్,మంద సుచందర్,వేలు సుమన్, వేలు రజిత,గబ్బెడ సతీష్,నాంపల్లి మౌనిక,అజీమా, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .