"కానరానిదేశంలో కన్నబిడ్డ-తల్లడిల్లుతున్న పేగు బంధం"

విదేశీ విధానాలతో ఎన్నారై ల మానసిక ఒత్తిడి

సామాజిక వేత్త లోడిగ. వెంకన్నయాదవ్

ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 20,తెలంగాణ ముచ్చట్లు;

ఉన్నతవిద్యకొరకు ,ఉత్తమమైన ప్రమాణాలతో జీవన విధానంలో జీవిత మార్పు కొరకు  , భారతీయ విద్యార్దులు తమ భౌషత్ కొరకు విదేశీ బాటపట్టారు. అదే వారి పాలిట 'ట్రంపు'రూపంలో శాపంగా మారనుంది. ఆర్థిక వెసులుబాటు తో కొంతమంది, ఆర్థిక వెసులుబాటు లేక పోయినా  బ్యాంకు ఋణాలతో మరి కొంతమంది తమ పిల్లల భౌషత్ కొరకు బంగారు బాటను ఊహించి విదేశీ చదువు ను ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆస్తులు తాకట్టు పెట్టి ఋణగస్తులై పిల్లలు అడిగిందే తడువుగా ఏదేశం పడితే ఆ దేశం పంపించారు. ఒకరివెనుక ఇంకొకరు 'క్యూ'కట్టి వెళ్ళారు. యువత అంతా భారత దేశం ఖాళీ చేసి వెళ్ళుతున్నారు  అన్నంతగా భ్రాంతి కలిగించారు. అక్కడ ఉద్యోగం పొంది  విలాసవంతమైన బంగ్లా, కారు కోట్లలో కొనుగోలు చేసి తమ జీవితాలు ఈఎంఐ లకు తాకట్టు పెట్టి ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక బీతిల్లిపోతున్నారు కొందరు. చదువు పూర్తి అయినా ఇంకా కొలువు తీరక అక్కడ పని దొరకక వెతలు పడుతున్న వారెందరో....ఉత్తచేతులతో ఇంటికి రాలేక విదేశాలలో ఉద్యోగం లేక తెచ్ఛిన బ్యాంకు ప్రెవేట్ ఆప్పులు భారంగా భావించి మానసిక ఒత్తిడితో బాధపడుతూ బతుకు జీవుడా అని విదేశాలలో కాలం వెల్లదీస్తున్న యువత మరికొందరు. ఒకరి  తో ఇంకొకరికి సంభందం లేకుండా బాధలు అనుభవిస్తూ పనిచేసుకొంటూ చాలిచాలని జీతంతో జీవితం గడుపుతున్నారు. తల్లిదండ్రులను పైసలు పంపించండి అని అడగలేక అక్కడ పని దొరకక వెతలు పడుతున్న పిల్లల బాధలు తెలుసుకొని తెలిసినా తెలియనట్టు తల్లిదండ్రులు లోలోన మనసులో  మదనపడుతూ  కుమిలిపోతున్న కన్నతల్లిదండ్రులు మరికొందరు ...విదేశీయుుల రాకతో స్తానికంగా ఉద్యోగ అవకాశాలు లేకుండా దేశీయులు నష్టపోతున్నాము అని జాతిభేదాలతో రెచ్చగొట్టి  రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ  నాయకులు. దానిలో ప్రథముడు డోనాల్డ్ ట్రంప్ ఒకరు .దీనిని అదునుగా చూసుకొని కొందరు సంఘవిద్రోహ శక్తులు జాతి విభేదాలు సృష్టించి కాల్చిచంపడం,హత్యచేయటం సంఘటనలు జరుగుతున్నాయి. విదేశీయుులు వెళ్ళిపోవాలి అని ఇటీవల లండన్ లో బారీ ర్యాలీ జరిగింది. అక్కడి నాయకులు కూడ దేశీయ చట్టాలు మార్పు చేస్తున్నారు. స్వదేశీయులకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.మన వారు బయట తిరగడానికే భయపడుతున్నారు.  దేశీయ స్వప్రయోజనాలు మాకు ముఖ్యం అని నీతిసూత్రాలు పలుకుతూ దేశీయ  రాబడిపెంపుకు  విదేశీయులను నుంచి  ఫీజుల రూపంలో దండిగా రాబట్టు కొంటున్నారు. .కాలేజి ఫీజులు పదిరెట్లు పెంచి విదేశీయుల రాబడితోనే నడుపుతున్న కాలేజీ లెన్నో... ఉద్యోగ మోజులో  బ్రోకర్ వ్యవస్థను ఆశ్రయించి వారిద్వార జీవితకాలం ఆదాయం దారబోస్తూ తప్పుడు పత్రాలతో పట్టు పడుతున్నావారు కొందరు.
ఇదంతా తెలిసినా లక్షలు వెచ్చించి ఉన్నత విద్యకొరకు వెళ్ళి ఉద్యోగం సంపాదించలేక వీసా గడువు ముగుస్తున్నా  అక్కడే ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పెట్రోల్ బంకులలో, మాల్స్ లలో హోటల్లో , వీది షాపులలో పనిచేస్తూ జీవితం గడుపుతున్నారు. ఇదంతా తెలిసినా ఇంకా అక్కడే ఉండటం వెనుక ఒకే ఒక్క కారణం ఉద్యోగం రాకపోతుందా అన్నా చిరుఆశ. ఒకేఒక్క చిన్న ఆశతో విదేశాలలో బతుకుతున్నారు. ఇట్టి విశయాలు తల్లిదండ్రులకు పూర్తి గా తెలియకుండా కొన్ని నిజాలు దాచిపెట్టి పిల్లలు అక్కడ ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా ,టీవీ, పత్రికలు విదేశాలలో విద్యార్థులు, విదేశీయులు పడుతున్న వెతలు కళ్ళకు కట్టినట్టు  చూపిస్తున్నారు. టీవీలు అదేపనిగా ఇట్టి వీషయాలపై ఊదరగొట్టి తల్లిదండ్రులను గందరగోళంగా ప్రశాంతంగా ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు ఉండలేక పోతున్నారు.   దీనివలన తమ పిల్లలు ఎలా ఉన్నారో ,ఏలాంటి అగాయిత్యాలకు పాల్పాడతారో,ఏ సంఘవిద్రోహ శక్తుల బారినపడి తమ పిల్లలకు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో, పిల్లలు మానసిక వత్తిడికి లోనై  చెడుఅలవాట్లకు బానిసలుఅవుతాడో అని తమ కొడుకు పై ఉహాజనితంగా నాకొడుకు ఎక్కడ చెడిపోతాడోఅని మానసికంగా తల్లిదండ్రులు ఒత్తిడితో ఉంటున్నారు. బిక్కు బిక్కు మంటు బతుకు జీవుడా అని జీవితం గడుపుతున్న తల్లిదండ్రులు ఎందరో..
పిల్లలు సెటిల్ అవ్వక ,సెటిల్ అయిన పిల్లలు ఉద్యోగ భద్రత లేక పెండ్లిల్లకు దూరంగా ఉంటున్నారు. ఇండియా కీ రాకుండా, పెండ్లి చేసుకొక తాతలు, తాతయ్యాలు అమ్మలు అమ్మమ్మలుగా చూడాలనుకొనే కొందరికి ఆశలుు నెరవేరడంలేదు. మావాడు అమేరికా లో ఉన్నాడు అని ఏ ఒక్కరు దైర్యం గా చెప్పుకొనే పరిస్థితి ఈనాడు లేదు.దీనికి కారణాలు ఏమీటి అని తల్లిదండ్రులు, ప్రభుత్వాలు  అన్వేషించాలి. ప్రభుత్వాలు కూడ దూరదృష్టితో ప్రణాళికలు రచించాలి.విదేశీ చదువులు నేరంకాదు.కాని అక్కడ చదువు లతో ఇక్కడికి వచ్ఛి ఉద్యోగం చేసుకొనేలా , స్వతంత్రంగా జీవించే మార్గాలు ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి.విదేశీ ప్రమాణాల తో వారి ప్రతిభను  మన దేశంలోనే ఉపయోగ పడేలా దేశ ప్రగతి కి బాటలు వేసేలా విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహించిన నాడు యువత విదేశీ బాటపట్టకుంటా ఉంటారు.ఒక వేళ్ళ వెళ్ళినా భరోసాగా స్వదేశానికి తిరిగి రావాలి .ఆనమ్మకం ప్రభుత్వం యువతకు  కల్పించాలి.మన దేశంలో లోనే యువత భరోసాగా జీవించ గలిగే రోజులు రావాలని ప్రభుత్వాలు ఆదిశగా ఆలోచించాలి అని ఆశీద్ధాం..

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .