ఘనంగా యువజన ఉత్సవాలు.. 

జిల్లా యువజన, క్రీడల అధికారి సునీల్ రెడ్డి

ఘనంగా యువజన ఉత్సవాలు.. 

ఖమ్మం బ్యూరో, నవంబర్- 11, తెలంగాణ ముచ్చట్లు;

జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రం లో మంగళవారం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తుంబూరు సునీల్ రెడ్డి అన్నారు. 29 వ జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలను 850 మంది యువ కళాకారులతో జిల్లా స్థాయి కళాకారుల ఎంపికలను విజయవంతంగా నిర్వహించినట్లు యువజన, క్రీడల అధికారి అన్నారు. స్వామీ వివేకానంద చిత్రపటానికి పూల  మాలలతో అలంకరించి, జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు.  WhatsApp Image 2025-11-11 at 8.21.25 PMWhatsApp Image 2025-11-11 at 8.21.24 PM (1) జానపద నృత్యంగ్రూప్ ఫోక్ డ్యాన్స్, జానపద గేయాలు గ్రూప్ ఫోక్ సాంగ్, వ్యాస రచన, పోస్టర్ తయారీ, వ్రకృత్వ పోటీలు, కవిత్వం, ఇన్నోవేషన్ మొదలగు అంశాలలో ప్రదర్శనలు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఆర్. ఉదయ్ కుమార్, న్యాయ నిర్ణేతలు విచ్చేసిన జాన్, మాలతీ నాయుడు , ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ లెక్చరర్లు కే. రవికుమార్, ఐ. కిరణ్ కుమార్, కే. మధు, బి. శ్రీనివాస్, జి. వీరన్న, యువజన సంఘాల సమితి అధ్యక్షులు ఉమాశంకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .