ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 --- 2006-2007 బ్యాచ్ విద్యార్థులు 

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

వారంతా చిన్ననాటి స్నేహితులు ... ఒకే చోట చదువుకున్నారు. పదవ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరి కొంతమంది వ్యాపారం ఇతర రంగంలో కొనసాగుతున్నారు. పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరికన్నా మన జీవితంలో జరగని ముద్ర వేసేది పదవ తరగతి వరకు చదువుకున్న దోస్తులు, వారితో ఉన్న జ్ఞాపకాలు ఏప్పటికీ మర్చిపోలేనిది మరపు రానివి. పదవ తరగతి తర్వాత దూరమైన అలాంటి స్నేహితులను మళ్ళీ 17 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకోవడం సంతోషంగా ఉంటుంది. పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడి నెలకొంది. స్నేహితులందరూ ఆత్మీయ పలకరింపులు, ఆలింగణాల నడుమ, నాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన గురువులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. పూర్వ విద్యార్థుల అందరం కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపు కోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2006-2007 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .